శాతకర్ణి హడావిడి మొదలైంది!

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది. బాలయ్య నిర్ణయించిన ముహూర్తం ఏడు గంటల యాభై నిమిషాలకు ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అతిథులుగా రానున్నాను. ఇప్పటికే ఈ సినిమా కోసం తయారు చేసిన డిజిటల్ ఇన్విటేషన్లు హాట్ టాపిక్ అయ్యాయి.

ఒక్కో ఇన్విటేషన్ ఖరీదు ఎనిమిదివేలకు పైనే.. దాదాపు వంద మంది అతిథులకు ఈ ఇన్విటేషన్స్ పంపారు. ఆడియో విడుదలకు ముందు సభా వేదిక వరకు భారీ ర్యాలీను నిర్వహించనున్నారు. 500 కార్లు, 100 బైకులూ, ఓ గుర్రపు రధంతో ఈ ర్యాలీ సాగనుంది. గుర్రపు రధంలో బాలయ్య ఉంటాడని సమాచారం. ఈ కార్యక్రమానికి అభిమానులు ఎంతమందైనా.. రావొచ్చని చిత్రబృందం వెల్లడించింది.