HomeTelugu News'శాతకర్ణి' రిలీజ్ డేట్ ఖరారు!

‘శాతకర్ణి’ రిలీజ్ డేట్ ఖరారు!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాగానే కాక, అఖండ భారతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహారాజు ‘శాతకర్ణి’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా యావత్ ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ప్రేక్షకుల, నందమూరి అభిమానుల ఎదురుచూపులకు సమాధానంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల తేదీని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబులు మాట్లాడుతూ.. “నందమూరి బాలకృష్ణగారితో పనిచేయాలన్న మా కోరిక ఈ సినిమా ద్వారా తీరడం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య 100వ సినిమా అయిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తుండడం మాకు గర్వకారణం. మోరోకో, మధ్యప్రదేశ్ ప్రదేశాల్లో చిత్రీకరించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలకృష్ణగారు చూపిన తెగువ, ఆయన అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీలు పోషించిన ప్రత్యేక పాత్రలు సినిమాకి ఆయువుపట్టు. మా క్రిష్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా రూపొందించడంతోపాటుగా తెలుగువారికి తెలియని తెలుగోడు ‘శాతకర్ణి’ ఘనకీర్తిని అద్భుతంగా తెరకెక్కించాడు. శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శూరుడైన ‘శాతకర్ణి’ చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభాన్నిద్దాం. పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్ లోనే చూడాల్సిందిగా నిర్మాతలుగా మా మనవి” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!