
Harry Potter TV Series 2025 Budget:
హ్యారీ పోట్టర్ కథలు 90ల పిల్లల జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. జె.కె. రౌలింగ్ రాసిన నవలలు, 2001లో వచ్చిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాయి. 2011లో చివరి సినిమా వచ్చాక, ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా ఒక శూన్యంలా అనిపించింది.
ఈ మాయలోని ప్రపంచం మళ్లీ బహిరంగమవుతోంది. 2025లో HBO మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి కొత్తగా హ్యారీ పోట్టర్ టీవీ సిరీస్ రూపొందిస్తున్నారు. ప్రతీ సీజన్ ఒక పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని మరింత లోతైన కథనంతో ప్రేక్షకులను మెప్పించనున్నారట.
‘పాటర్విల్లే’ నిర్మాణం
ఈ సిరీస్ కోసం యూకేలోని లీవ్స్‌డెన్ స్టూడియోలో ‘పాటర్విల్లే’ అనే ప్రత్యేక సెట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో స్కూల్, మెడికల్ సెంటర్, కొత్త రోడ్లు, పెద్ద హ్యాంగర్లు, అప్‌డేటెడ్ ప్రివెట్ డ్రైవ్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. మొత్తం ప్రాజెక్ట్‌కి ఖర్చు రూ. 1.08 లక్షల కోట్లు (అమెరికన్ డాలర్లలో $1.27 బిలియన్).
నতুন తరం నటులతో సిరీస్
పాత సినిమా తారాగణం కాకుండా, కొత్త నటులతో ఈ సిరీస్ వస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన పాత్రలు ఇలా ఉన్నాయి:
అల్బస్ డంబుల్డోర్ – జాన్ లిత్గో
స్నేప్ – పాపా ఎస్సీడు
మాక్గోనగాల్ – జానెట్ మక్‌టియర్
హాగ్రిడ్ – నిక్ ఫ్రాస్ట్
ఫిల్చ్ – పాల్ వైట్‌హౌస్
క్విరెల్ – లూక్ థాలన్
హ్యారీ, రాన్, హెర్మియోన్ పాత్రలకు 32,000కు పైగా ఆడిషన్స్ వచ్చాయి. 2025లో షూటింగ్ మొదలై, 2026 లేదా 2027లో Max (HBO Max) లో విడుదల కానుంది.
ALSO READ: Cannes కి Alia Bhatt రాకపోవడం వెనుక అసలు కారణం అదేనా?













