
Anushka Sharma at IPL 2025 final:
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అంటే ఆవేశం, ఉత్సాహం, ఆనందం అన్నీ కలిసిన అద్భుతమైన సమయం. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఎట్టకేలకు ట్రోఫీ గెలుచుకుని 18 ఏళ్ల పొడవైన నిరీక్షణకు తెరదించింది. విరాట్ కోహ్లీ గెలిచిన ఆనందంతో ఊపిరి పీల్చుకోగలిగాడు. అయితే అతని కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినది ఎవరో తెలుసా? అనుష్క శర్మ!
విరాట్ విజయాన్ని చూడటానికి ఫీల్డుకు వచ్చిన అనుష్క శర్మ తన స్టైల్, సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లటి క్లాసిక్ షర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్‌లో కూల్ లుక్‌తో కనిపించిన అనుష్క ముఖం మీద ఆనందం తేలిపోయింది. కానీ అభిమానులు గుర్తించిన ఒక ప్రత్యేకమైన విషయం – ఆమె చేతిలో ఉన్న విలువైన రోలెక్స్ వాచ్!
View this post on Instagram
అనుష్క ధరించిన వాచ్ “Platinum Rolex Day-Date 40”. దీని విలువ రోలెక్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం రూ. 56.47 లక్షలు. అయితే ఆమె వాచ్ డైమండ్-సెట్ బెజెల్‌తో ఉండటంతో దీని ధర రూ. 99.79 లక్షలకు చేరిందట. ఇది చూస్తే, ఆమె స్టైల్‌కు అంత బడ్జెట్ కూడా ఉందనిపిస్తుంది కదా!
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో RCB టీమ్ PBKS పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఆ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కను కౌగిలించుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సీన్స్‌ను చూసిన ప్రతి ఒక్కరి గుండె తలుపుల్ని తడిమేశాయి.
ALSO READ: OG సినిమా గురించి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలుసా?