శ్రద్ధా శ్రీనాథ్ ఆ హీరోనే ఎంచుకుంటుందట

‘జెర్సీ’ సినిమాతో నటిగా టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ చిత్రం ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా శ్రద్ధా శ్రీనాథ్‌ విలేకరులతో ముచ్చటించారు. ‘యశ్‌ లేదా నాని.. నటనపరంగా మీరు ఎవర్ని ఎంచుకుంటారు?’ అని విలేకరి ప్రశ్నించగా తడుముకోకుండా నాని పేరు చెప్పారు. ‘నేను నానిలాంటి స్టార్‌తో కలిసి పనిచేశా. అందుకే యశ్‌ను కాకుండా నానిని ఎంచుకున్నా. యశ్‌ కూడా ఇప్పుడు తనకున్న స్టార్‌డమ్‌ను సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. ఆయన సినిమాల్లోకి రాకముందు ఓ బుల్లితెర నటుడిగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నాకు తెలుసు. ఆయన ‘కేజీఎఫ్‌’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటారు. యశ్‌ను ఓసారి కలిశా’ అని ఆమె చెప్పారు.
అనంతరం ఇష్టమైన చిత్ర పరిశ్రమ ఏది? అని ప్రశ్నించగా.. ‘నాకు అన్ని చిత్ర పరిశ్రమలూ ఇష్టమే. నేను పనిని వృత్తిపరంగా మాత్రమే చూస్తాను. కాబట్టి వాటిలో ఇష్టమైంది ఏది అని ఎంచుకోను. నాకు ఫలానా ఇండస్ట్రీ ఇష్టం అని చెబితే.. అభిమానుల్ని కోల్పోతాను’ అని శద్ధా శ్రీనాథ్‌ అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates