
Sania Mirza Car Collection:
సానియా మీర్జా పేరు వినగానే మనకు టెన్నిస్ క్వీన్ గుర్తుకొస్తుంది. ఆమె ఆడిన మ్యాచ్‌లు, గెలిచిన టైటిల్స్ చూస్తే యావత్ భారతదేశం గర్వపడుతుంది. కానీ ఈసారి సానియా టెన్నిస్ విషయంలో కాకుండా, తన లైఫ్స్టైల్ వల్ల వార్తల్లోకెక్కింది.
తాజాగా ఆమె తన కార్ కలెక్షన్‌లో మరో లగ్జరీ కారును జతచేసింది. అబుదాబీలోని పోర్ష్ సెంటర్ నుండి సానియా కొత్తగా Porsche 718 Boxster ను కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.1.6 కోట్లట. పోర్ష్ అధికారికంగా సానియాకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
సానియా లగ్జరీ కార్స్ పట్ల ఉన్న ఆసక్తి గురించి చాలా మందికి తెలుసు. ఆమె దగ్గర ఇప్పటికే BMW 7-సిరీస్, Jaguar XF, Range Rover Evoque, Porsche Cayenne వంటివి ఉన్నాయి. ఈ మొత్తం కలెక్షన్ విలువ రూ.3 కోట్లకు పైగానే ఉంటుంది.
ఇక సానియా వ్యక్తిగత జీవితంలో కొన్ని మలుపులు తలెత్తాయి. ఆమె తన భర్త షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకుంది. షోయబ్ Sana Javed అనే పాకిస్థాన్ నటిను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా, సానియా బలంగా నిలిచింది. ఆమె తన కెరీర్‌తో పాటు తన కుమారుడు ఇజ్హాన్‌ను ఎంతో ప్రేమగా పెంచుతోంది.
స్టైల్, ఫిట్‌నెస్, ఫ్యాషన్, ట్రావెల్ అన్నీ సానియాకు ఇష్టమైనవి. అంతేకాక, ఆమె సామాజిక మాధ్యమాల్లో తన లైఫ్‌స్టైల్‌ను రెగ్యులర్‌గా పంచుకుంటుంది. ఇది చూసి అభిమానులు ఆమెపై మరింత ప్రేమను చూపుతున్నారు.
ఈ పోర్ష్ 718 బాక్స్టర్ కొనుగోలు సానియాకు మరో మైలురాయి అని చెప్పవచ్చు. ఆమె సక్సెస్‌ఫుల్ కెరీర్‌కు ఇది ఒక ప్రతీక. మహిళలు స్వయం సమర్థులుగా ఎలా ఎదగాలో సానియా నిజంగా ఒక రోల్ మోడల్.
ALSO READ: SSMB29 సినిమాలో రాజమౌళి స్పెషల్ కామెడీ పాత్రలో మహేష్ బాబు?