HomeTelugu Big StoriesShah Rukh Khan కొత్త లెక్సస్ కార్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Shah Rukh Khan కొత్త లెక్సస్ కార్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Guess the price of Shah Rukh Khan's new Lexus car!
Guess the price of Shah Rukh Khan’s new Lexus car!

Shah Rukh Khan new car price:

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ స్టైల్‌లో కొత్త టచ్‌ ఇచ్చారు! ఇటీవలి రోజుల్లో ముంబై వీధుల్లో కొత్త లగ్జరీ కారులో షారుక్ కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎప్పుడూ BMW లేదా Rolls-Royce Cullinan Black Badge కార్లలో కనిపించే షారుక్, ఈసారి తన కొత్త Lexus LM 350h 4S Ultra Luxury కారుతో రోడ్లపై సందడి చేశారు.

ఈ లగ్జరీ MPV కార్ భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. దాని ధర ఏకంగా రూ.3 కోట్లు. ప్రత్యేకంగా షారుక్ ఈ కార్‌ను తన చిన్న కుమారుడు అబ్రామ్ కోసం గత ఏడాది అక్టోబరులో కొనుగోలు చేసినట్లు సమాచారం. అబ్రామ్ కోసం ఓ ప్రత్యేక బహుమతిగా షారుక్ ఈ కార్‌ను తీసుకురావడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇటీవలి కాలంలో నాగార్జున, జాహ్నవి కపూర్, రణబీర్ కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా లెక్సస్ కార్లను తమ కలెక్షన్‌లో చేర్చుకున్నారు. కానీ షారుక్ ఖాన్ లెక్సస్ కార్‌పై సొంత స్టైల్‌ను చూపించడం ప్రత్యేకంగా నిలిచింది.

ప్రస్తుతం షారుక్ ఖాన్ తన కొత్త సినిమా ‘కింగ్’పై దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో ఆయన తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయనున్నారు. 2024లో కొన్ని బ్రేక్‌లు తీసుకున్న షారుక్, 2025లో తన అభిమానులను మరింత ఆకట్టుకునే ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu