
Most Expensive Music Video in the world:
ఈ రోజుల్లో మ్యూజిక్ వీడియోలంటే పంచపండుగలా ఉంటాయి. భారీ సెట్లు, గ్రాఫిక్స్, స్టైలిష్ లొకేషన్లు, డాన్స్ – అన్నీ హై బడ్జెట్‌తో. కానీ షాక్ thing ఏమిటంటే, 2025కి వచ్చినా ఇప్పటికీ ప్రపంచంలోనే ఖరీదైన మ్యూజిక్ వీడియో మాత్రం 1995లో వచ్చినదే! అవును, అదే మైఖేల్ జాక్సన్ మరియు జానెట్ జాక్సన్ కలిసి చేసిన Scream వీడియో!
ఈ వీడియో ఓ సైన్స్ ఫిక్షన్ స్పేస్‌షిప్‌లో సెట్ చేసినట్టు ఉండేలా ఉంది. దీని కోసం 11 సెట్లు ప్రత్యేకంగా కట్టారు. ఒక్క సెట్లకే దాదాపు రూ. 41 కోట్లు ఖర్చయింది. జానెట్ మేకప్ ఖర్చు రోజుకి రూ. 6.6 లక్షలు! గ్రాఫిక్స్ కోసం రూ. 54 లక్షలు, లైటింగ్ ఖర్చు రూ. 1.45 కోట్లు. ఇక డాన్స్, వీడియో ఆర్ట్, గిటార్‌లు పగలగొట్టడం లాంటి వాటికి కోట్లల్లో ఖర్చు పెట్టారు!
మొత్తంగా చూస్తే, ఈ వీడియోకు అప్పట్లో డాలర్లలో 7 మిలియన్, అంటే మన రూపాయల్లో రూ. 58 కోట్లు ఖర్చయ్యింది. కానీ ఇప్పటి వరకూ దాని రికార్డ్ చెరగలేదు. నేడు దాని ఖర్చును ఇన్ఫ్లేషన్‌తో లెక్క చేస్తే, దాదాపు రూ. 120 కోట్లు అవుతుందట!
“Scream” వీడియో మార్క్ రొమేనెక్ అనే డైరెక్టర్ తీసాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే, మైఖేల్ జాక్సన్ ఒక్క హ్యాండ్‌క్లాప్ సౌండ్‌కే ఎన్నో రోజులు ఎడిట్ చేయించాడట! అంత పర్ఫెక్షన్.
వీడియో విడుదలైన వెంటనే Billboard Top 5లోకి ఎంటర్ అయింది. MTV, గ్రామీ అవార్డులు కూడా గెలుచుకుంది. తర్వాత TLC’s No Scrubs, Ciara’s I’m Out లాంటి వీడియోలకు స్ఫూర్తిగా మారింది.
ఇప్పుడున్నంత డిజిటల్ టెక్నాలజీ, భారీ బడ్జెట్ వీడియోలు ఉన్నా… “Scream” స్టైల్, మూడ్, మెసేజ్ – ఇవేవీ ఇప్పటికీ అవుట్‌డేట్ కాలేదు. అది మైఖేల్ జాక్సన్ మ్యాజిక్!
ALSO READ: కథ చాలా బాగా నచ్చినా Vijay Deverakonda ఆ హిట్ సినిమాని ఎందుకు వదిలేసుకున్నాడంటే..