
Top Film Industry 2025:
ఈ ఏడాది సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయ్! 2025లో మే నెల వరకు భారతీయ సినిమాలు కలిపి రూ. 5,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ – అన్ని ఇండస్ట్రీలు కలిపి గ్లోబల్‌గా మంచి కలెక్షన్లు సాధించాయి. అయితే ఏ ఇండస్ట్రీ టాప్‌లో ఉందో చూద్దాం.
Bollywood:
హిందీ చిత్ర పరిశ్రమ బాలీవుడ్ దూసుకెళ్తోంది. మే 2025 వరకు బాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 2008 కోట్లు వసూలు చేశాయి. ‘ఛావా’ అనే సినిమా ఏకంగా రూ. 678 కోట్లు సంపాదించి బాలీవుడ్‌కు బంపర్ హిట్ అందించింది.
Kollywood vs Tollywood:
టాలీవుడ్ (తెలుగు సినిమాలు) మరియు కోలీవుడ్ (తమిళ సినిమాలు) మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. కోలీవుడ్ రూ. 1196 కోట్లు వసూలు చేస్తే, టాలీవుడ్ రూ. 1181 కోట్లు వచ్చాయి. కేవలం రూ. 15 కోట్లు తేడా మాత్రమే ఉంది!
టాలీవుడ్ హిట్: సంక్రాంతికీ వస్తున్నాం – రూ. 245 కోట్లు
కోలీవుడ్ హిట్: గుడ్ బ్యాడ్ అగ్లీ – రూ. 212 కోట్లు
Mollywood:
మలయాళ సినిమాలు కూడా అదరగొడుతున్నాయి. మే వరకు మోలీవుడ్ సినిమాలు రూ. 879 కోట్లు వసూలు చేశాయి.
మొత్తం మలయాళ హిట్స్:
L2: ఎంపురాన్ – రూ. 265 కోట్లకు పైగా
తుదరం – రూ. 230 కోట్లు
2025 సెకండ్ హాఫ్‌లో ఇంకా భారీ సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. దాంతో ఇండియన్ సినిమాలు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాయో చూడాలి!