
Highest Paid Tv Actress 2025:
ఇప్పుడు టీవీ నటులు సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. టీవీ చూస్తే ప్రతి ఇంట్లో ఫ్యామిలీ సభ్యుల్లా ఫీలయ్యే ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. అలాంటి స్టార్లలో 2025లో టాప్‌లో ఉన్న నటి ఎవరో తెలుసా? పేరు వింటే ఆశ్చర్యపోతారు!
అది మరెవరో కాదు… మనకు తులసిగా గుర్తున్న స్మృతీ ఇరానీ! పాత టైం లో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ ‘క్యూకీ సాస్ భీ కభీ బహూ థీ’ మళ్లీ సీజన్ 2గా వచ్చేస్తోంది. అదే షోలో మళ్లీ తులసిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు స్మృతీ గారు.
అందుకే ఆమెకు ఒక్క ఎపిసోడ్‌కు రూ. 14 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్. ఇది ఇప్పుడు ఇండియన్ టెలివిజన్‌లో హయ్యెస్ట్! గతంలో జన్నత్ జుబేర్ రూ.18 లక్షలు అందుకున్నప్పటికీ, అది రియాలిటీ షోలో మాత్రమే. కానీ ఈసారి టీవీ సీరియల్ కోసం రెగ్యులర్‌గా ఈ స్థాయిలో ఇవ్వడం అంటే నిజంగా బిగ్ న్యూస్.
ఇంకా షో రీబూట్‌పై చాలా సీక్రసీ పాటిస్తున్నారు. సెట్‌కి ఫోన్లు అనుమతించట్లేదు. స్మృతీకి Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రమోషనల్ పోస్టర్ రెడీ అయిపోయింది. త్వరలోనే ప్రోమో షూట్ పూర్తవుతుందని, ప్రమోషన్ క్యాంపెయిన్ మొదలవుతుందని సమాచారం.
స్మృతీ ఇరానీ రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత మళ్లీ నటిగా రావడం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందట. ఆడియన్స్ ఎమోషన్‌తో పాటు నోస్టాల్జియాను క్యాష్ చేసేందుకే ఇదంతా అంటున్నారు టీవీ వర్గాలు.