ఆర్ఆర్ఆర్’ మూవీ ఫొటోలు లీక్‌.. రాజమౌళి సీరియస్

 

 

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌ మూవీ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జ‌రుగుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఈ చిత్రంలోని ఫోటోలు లీక్ కాకుండా ఆపలేకపోతున్నారు. ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతున్న సమయంలోనే మొబైల్స్ ద్వారా ఇంటర్‌నెట్లో లీక్ చేసేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌నే చెప్పాలి. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోను ఇదే జ‌రుగుతోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి తీసిన సన్నివేశాలు నెట్‌లో లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి కూడా కుమ్రం భీం లుక్ బయటికి వచ్చింది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. లీకైన ఫోటోలో ఎన్టీఆర్ కుమ్రం భీం లుక్‌లో అదిరిపోయాడు. ఈ సన్నివేశంలో ఆయన అక్కడున్న ప్రజలందరికి ఏదో చెబుతున్నట్టుగా కనిపిస్తున్నాడు తారక్.

CLICK HERE!! For the aha Latest Updates