‘హిరణ్యకశ్యప’ గా స్టార్ హీరో!

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ చారిత్రక చిత్రాలను తెరకెక్కించడం ధిట్ట. ‘రుధ్రమదేవి’ సినిమా తరువాత ఆయన ఓ చిన్న సినిమా చేయనున్నారనే మాటలు వినిపించాయి. కానీ గత రెండు రోజులుగా ఆయన ‘హిరణ్యకశ్యప’ కథ ఆధారంగా సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా గుణశేఖర్ కన్ఫర్మ్ చేశారు. తనకు చిన్నప్పటి
నుండి భక్త ప్రహ్లాద కథంటే ఎంతో ఇష్టమనీ.. అతడి తండ్రి హిరణ్య కశ్యపుడి పాత్ర అంటే మరింత ఇష్టమని చెప్పారు.

ఆ పాత్ర ఎప్పటినుండో తనను వెంటాడుతోందని అందుకే కథగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హిరణ్యకశ్యపుడి యాంగిల్ లో భక్త ప్రహ్లాద కథను ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. హిరణ్యకశ్యపుడి పాత్రలో ఓ అగ్ర కథానాయకుడు నటించనున్నట్లు.. అతడి పేరు వచ్చే నెలలో అనౌన్స్ చేస్తానని అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.