శంక‌ర‌మ‌హ‌దేవ‌న్ ‘విమెన్ యాంథెమ్ సాంగ్‌’!

మ‌న‌ల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేది అమ్మ‌. మ‌హిళ వ‌ల్ల‌నే జీవితం. ఈ జ‌ర్నీలో స్త్రీ పాత్ర గొప్ప‌ది. అలాంటి స్త్రీ కోసం ఓ గీతం ఉండాల‌ని ఆలోచించ‌డం.. అలా ఆలోచించి శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ లాంటి ఓ టాప్ సింగ‌ర్‌తో పాడించ‌డం నిజంగానే మెచ్చ‌ద‌గిన ప్ర‌య‌త్నం. శంక‌ర్ మ‌హదేవ‌న్ ఆలప‌న‌లో సుభాష్ సంగీతం అందించిన‌ ‘విమెన్ యాంథెమ్ సాంగ్‌’ ను హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌లో నేడు లాంచ్ చేశారు. ఈ పాట‌కు వివేక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, రాహుల్ నిర్మించారు. మ్యాడ్ ఓవ‌ర్ ఫిలింస్ ప‌తాకంపై రిలీజ‌వుతోంది. సుభాష్ సంగీతం, థురాజ్ సాహిత్యం అందించారు. అర‌వింద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మంలో ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి, సాంగ్ డైరెక్ట‌ర్ వివేక్‌, సంగీత ద‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వివేక్‌ మాట్లాడుతూ.. ”ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసేది అమ్మ కాబ‌ట్టి.. మ‌హిళ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి ఆవిష్క‌రించేలా ఈ పాట ఓ యాంథెమ్‌ ఉండాల‌ని ప్ర‌య‌త్నించాను. తురాజ్‌ చ‌క్క‌ని సాహిత్యం అందించారు. ఆశీస్సులు అందించిన పెద్ద‌ల‌కు థాంక్స్‌” అన్నారు. వాస్త‌వానికి తొలుత మ‌హిళ‌ల‌పై యాడ్ షూట్ చేయాల‌నుకున్నాం.. కానీ దానినే పాట‌గా మార్చాం. ర‌త్న‌వేలు శిష్యుడు అర‌వింద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పాటే క‌థా అని లైట్ తీస్కోలేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ పాట‌ను తెర‌కెక్కించాం. ప‌దిరోజుల్లో పూర్తి చేయ‌గ‌లిగామ‌ని” తెలిపారు.