HomeTelugu Trendingజాన్వీ 'గుంజన్‌సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్‌' ఫస్ట్‌లుక్‌

జాన్వీ ‘గుంజన్‌సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్‌’ ఫస్ట్‌లుక్‌

3 27బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్ ‘ధడక్‌’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు ‌. ఆమె ప్రస్తుతం ‘గుంజన్‌ సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలట్ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. దీనికి సంబంధించి జాన్వీ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం గురువారం సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్ర నిర్మాత కరణ్‌జోహర్‌ జాన్వీ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఆడవాళ్లు పైలట్లు కావొద్దు అని ఆమెకు చెప్పారు. కానీ, ఆమెలో ఎగరాలనే పట్టుదల ఉంది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

ఫస్ట్‌లుక్‌కు సంబంధించి మూడు ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. కాగితపు విమానాన్ని ఎగురవేస్తూ పైలట్‌ కావాలనే తన కలను తెలియజేసేలా ఉన్న జాన్వీ లుక్‌ ఆకట్టుకుంది. మరో పోస్టర్‌లో తోటి ఉద్యోగులను చప్పట్లతో అభినందిస్తుండగా పైలట్‌ దుస్తుల్లో జాన్వీ హుందాగా కన్పించారు. 2020 మార్చి13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయపడిన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరి ప్రశంసలు పొందిన మహిళ గుంజన్‌ సక్సేనా. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డుతో సత్కరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!