‘హను-మాన్’ మూవీ అప్డేట్‌

టాలీవుడ్‌ యువ నటుడు తేజ సజ్జ- డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘హను-మాన్’. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం 10.08 గంటలకు విడుదల కానుంది అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై ‘అంజనాద్రి ప్రపంచం నుంచి హనుమంతుడిని మీట్ అవ్వండి’ అని రాశారు. దీంతో మునుపెన్నడూ లేని అవతారంలో తేజ కనిపించనున్నాడు.

ప్రీ-లుక్ పోస్టర్ లో హనుమంతుడు నీటిలో పడిపోవడం కన్పిస్తోంది. ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates