HomeTelugu Big Storiesహ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌

హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌

hyd allu arjun
అల్లు వారసుడిగా, మెగా మెనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. పాన్‌ ఇండియా హీరో ఎదిగాడు అల్లు అర్జున్‌. బర్త్‌డే ఈ రోజు (ఏప్రిల్8). పుష్ప సినిమాతో తొలి పాన్‌ ఇండియా సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో బన్నీ నటనకు, యాసకు ప్రేక్షకులు ఫిదా అయిపోయ్యారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్స్‌ పుష్ప-2లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

hyd allu arjun1

ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ రోజు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. ఈ క్రమంలో నిన్న ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్‌, ఫస్ట్‌లుక్‌ ఈ సినిమాపై విపరీతమైన హైప్స్‌ని క్రియేట్‌ చేశాయి. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్‌లో ఉన్న పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే బన్నీ.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

hyd allu arjun2

ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ.. తన ఆనందాన్ని ప్రేక్షకుల్తో పంచుకున్నాడు. టాలీవుడ్‌లో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఆర్యతో యూత్‌లో మంచి క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ భాషల్లో సైతం అభిమానుల ప్రశంసలు పొందాడు.

Allu Arjun new poster from

ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా మారిపోయాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో తనదైన స్టైల్‌తో, డ్యాన్స్‌లతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిక్స్‌ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్‌దే.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu