హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌


టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఈరోజు (అక్టోబర్‌23) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్‌ వర్షం సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచంలోని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాహుబలి ప్రదర్శించబడింది. తరువాత ‘సాహో’తో అలరించాడు. తాజాగా రాధేశ్యామ్‌లో నటిస్తున్నాడు, దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్‌ డైరెక్టర్‌తో ఆదిపురుష్‌ అనే సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

CLICK HERE!! For the aha Latest Updates