జగపతి స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకే!

హీరో నుండి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతి బాబు మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన కీలకపాత్రలో నటిస్తోన్న మరో చిత్రం ‘పటేల్ సర్’. ఈ సినిమా విషయంలో జగపతి బాబు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీని వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది. మొదట ఈ కథ జగపతిబాబు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు విపరీతంగా నచ్చడంతో తన స్నేహితుడితో కలిసి తనే నిర్మించాలనుకున్నాడు. అయితే కొత్త దర్శకుడు రిస్క్ తీసుకుంటే సమస్య ఏమైనా వస్తుందా..? అని ఆలోచించి ముందుగా సినిమా టీజర్ ను చిత్రీకరించి చూపించమని అడిగారట. టీజర్ నచ్చడంతో సినిమా నిర్మాణానికి రెడీ అయ్యాడు జగపతి.

అయితే దానికి బ్యానర్ వాల్యూ కూడా ఉండాలని భావించి, సాయి కొర్రపాటిని సంప్రదించారట. ఆయన బ్యానర్ లోకి మార్చడంతో సినిమాను మరింత హైప్ క్రియేట్ అయింది. అందుకే సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ప్రతి ప్రమోషన్ లో ఆయన హవా కనిపిస్తూనే ఉంది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో.. చూడాలి!