కన్నడ హీరో, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ కొత్త చిత్రం ‘సీతారామ కళ్యాణ’ ట్రైలర్ విడుదల నిన్న సాయంత్రం మైసూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా కుమారస్వామి తన ప్రభుత్వానికి చెందిన 37 మంది ఎమ్మెల్యేలను, 14 మంది ఎమ్మెల్సీలను వేడుకకు ఆహ్వానించారు. దాదాపు పిలిచిన అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత కుమార స్వామి అందరికీ భారీ విందును ఏర్పాటు చేశారు. హర్ష దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. జనవరి 25న సినిమా రిలీజ్ కానుంది.













