ఓవర్సీస్ లో ఖైదీకు మెగా రేట్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్లుగానే సినిమా బిజినెస్ జరుగుతోంది. ట్రేడ్ సర్కిల్ లో సినిమా క్రేజ్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లకు అమ్ముడిపోగా.. తాజాగా ఓవర్సీస్ లో కూడా భారీ రేట్ పలికిందని తెలుస్తోంది. దాదాపు 14 కోట్ల భారీ మొత్తానికి ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు అమ్ముడిపోయినట్లు సమాచారం.

ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను జనవరి 4న విజయవాడలో నిర్వహించనున్నారు. మెగా హీరోలు ఈ వేడుకలో తమ పెర్ఫార్మన్స్ లతో అభిమానులను ఆకట్టుకొనున్నారు. ఈ వేడుకను రానా, నవదీప్ లు హోస్ట్ చేయనున్నారన్న సంగతి తెలిసిందే.