
Katy Perry Space Travel Cost:
పాప్ సింగర్ కేటీ పెర్రీ తాజాగా చేసిన స్పేస్ ట్రిప్ గురించి వినగానే ఆశ్చర్యం కలిగింది కదా! ఏప్రిల్ 14న ఆమె బ్లూ ఒరిజిన్ అనే రాకెట్‌లో స్పేస్‌కి వెళ్లింది. ఈ ట్రిప్‌కి ఇంకా ప్రత్యేకత ఏంటంటే – ఇది మొత్తం మహిళలతో జరిగిన స్పేస్ ప్రయాణం. ఇలాంటి ప్రయాణం 60 సంవత్సరాల తర్వాత జరుగడం విశేషం.
ఈ ప్రయాణంలో వారు భూమిపై నుంచి 100 కిలోమీటర్లకు పైగా వెళ్లారు. ఇది స్పేస్ ఆరంభం అని గుర్తించే కార్మాన్ లైన్‌ను దాటి వెళ్లింది. మొత్తం ట్రిప్ కేవలం 11 నిమిషాలే అయినా, అనుభవం మాత్రం జీవితాంతం మర్చిపోలేనిదిగా మారింది. కేటీ పెర్రీ జీరో గ్రావిటీలో “What a Wonderful World” పాట పాడటం స్పెషల్ మూమెంట్‌గా మారింది.
ఈ స్పేస్ ట్రిప్‌లో కేటీ పెర్రీతో పాటు మరో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. వాళ్లలో జెఫ్ బెజోస్ ఫియాన్సీ లారెన్ శాంచెజ్, CBS హోస్ట్ గేల్ కింగ్, NASA శాస్త్రవేత్త ఐషా బోవే, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అమాండా న్యూయెన్, మరియు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కెరియన్ ఫ్లిన్ ఉన్నారు.
ఇలాంటి స్పేస్ ట్రిప్ మనం కూడా చేయచ్చా? సాధ్యమే కానీ ఖర్చు చాలా ఎక్కువ. బ్లూ ఒరిజిన్ వాళ్లు అసలు టికెట్ ధర బయటపెట్టరు. కానీ ఒకసారి స్పేస్ టికెట్ వేలంలో రూ.239 కోట్లకి అమ్మబడింది. ఇంకా ముందస్తుగా రూ.1.29 కోట్లు డిపాజిట్‌గా వేసి మాత్రమే రిజిస్టర్ చేయొచ్చు.
ప్రస్తుతం స్పేస్ ప్రయాణాలు సెలబ్రిటీలకు, బిజినెస్ మెగ్నేట్లకు మాత్రమే సాద్యమైనవి. కానీ భవిష్యత్తులో సాధారణ మనుషులకూ స్పేస్ లో వాహ్ అనిపించే రోజు రానుందనడంలో సందేహం లేదు!