
HIT 3 Hindi box office collection:
నాని హీరోగా నటించిన HIT 3 సినిమా తెలుగులో మంచి ఓపెనింగ్ సాధించింది. అయితే, ఈసారి ఈ సినిమాను పాన్-ఇండియా లెవెల్‌లో ప్రమోట్ చేయాలని నాని చాలా ట్రై చేశాడు. యూట్యూబర్లు, బాలీవుడ్ మీడియా, జాతీయ మీడియా ఇలా చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. “అబ్కీ బార్ అర్జున్ సర్కార్” అనే హిందీ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు.
అంతటితో ఆగలేదు… హిందీ బెల్ట్‌లో ప్రమోషన్స్ జోరుగా చేశాడు. కానీ ఫలితం? పెద్దగా రాలేదు! హిందీలో సినిమా వసూళ్లు పరమ పరవశంగా ఉన్నాయి. మొత్తం హిందీ వెర్షన్ కేవలం రూ.90 లక్షలే వసూలు చేసింది.
View this post on Instagram
మరోవైపు తమిళ, మలయాళ వెర్షన్లు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమిళనాట సూర్య “రెట్రో” వల్ల పోటీ ఎక్కువగా ఉండటంతో HIT 3 అక్కడ ఫలించలేదు. మలయాళంలో అయితే అంతకన్నా బోరుగా… మొత్తం తొలి వీకెండ్‌లో కేవలం 10-15 లక్షలే వచ్చాయి.
ఇక ఇవన్నీ చూస్తే, నాని చేసిన పాన్ ఇండియా ప్రయత్నం మరోసారి ఫలించలేదని చెప్పవచ్చు. ఇంతగా ప్రమోట్ చేసినా, ఇతర భాషల ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. ఒకవేళ కంటెంట్ లోకల్ మేజిక్ చూపిస్తేనే పాన్ ఇండియా రీచ్ సాధ్యమవుతుందేమో.
తెలుగులో మాత్రం ఓపెనింగ్ వీకెండ్‌లో సినిమా డీసెంట్ కలెక్షన్లతో కొనసాగింది. కానీ ఇతర భాషల్లో ఇది ఓ పెద్ద ఫెయిల్యూర్‌గా మారడం ఆశ్చర్యంగా మారింది. నానికి ఇది కాస్త నిరాశే కావచ్చు!
ALSO READ: Hit 3 box office collection day 6: Can Nani’s thriller keep Its momentum?