
Ram Charan remuneration after Game Changer:
సంక్రాంతి స్పెషల్‌గా భారీ అంచనాలతో విడుదలైన రామ్ చరణ్, శంకర్ కలయికలో రూపొందిన Game Changer ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు రూ. 200 కోట్లకు పైగా నష్టాలను తెచ్చింది.
ఈ చిత్రం ఇండియాలో కేవలం రూ. 186 కోట్లు, ఉత్తర అమెరికాలో USD 1.98 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ ఫలితాలు బ్రేక్‌ఈవెన్ మార్క్ కి చాలా దూరంగా ఉన్నాయి. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, అంచనాల మధ్య ఉన్నప్పటికీ, కంటెంట్ లో లోపాల కారణంగా సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
అయితే సినిమా నిర్మాణంలో జాప్యం కలిగినప్పుడు ఆయన తన రెమ్యూనరేషన్ తగ్గించి దిల్ రాజుకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా, సినిమా విడుదల తర్వాత మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధపడ్డారు. దిల్ రాజుతో చేయబోయే తదుపరి చిత్రం కోసం తన రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోనని చరణ్ హామీ ఇచ్చారు. ఇది చరణ్ తన టీమ్‌పై చూపిన అభిమానం ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది.
రామ్ చరణ్, దిల్ రాజు కలిసి చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఈ ఇద్దరికీ కొత్త ఆరంభంగా ఉండబోతుంది. ‘గేమ్ ఛేంజర్’ అండర్‌ఫర్‌మెన్స్ టాలీవుడ్ పరిశ్రమకు పాఠంగా మారింది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్ ఉన్నా, కంటెంట్ బలమైనది లేకుంటే విజయం సాధించడం కష్టమే. కాబట్టి, నిర్మాతలు మంచి కథలు, ప్యాకేజింగ్ పై దృష్టి పెట్టడం అవసరం.