HomeTelugu Trending'కార్తికేయ 2' కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది: నిఖిల్‌

‘కార్తికేయ 2’ కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది: నిఖిల్‌

Hero Nikhil about
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్.. చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమా ఈ నెల 13వ తేదీన థియేటర్‌ల్లో విడులైంది. ఒక వైపున ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉన్నప్పటికీ, ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను ఆపడం లేదు. తాజా ఇంటర్వ్యూకి దర్శక నిర్మాతలతో పాటు, నిఖిల్ – అనుపమ కూడా హాజరయ్యారు.

నిఖిల్ మాట్లాడుతూ.. ‘కార్తికేయ 2’ కంటెంట్ పై మాకు నమ్మకం ఉంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన చాలా టెన్షన్ పడ్డాము. జనాలు థియేటర్లకు వస్తారా .. చూస్తారా? ఇలా ఎన్నో ఆలోచనలు. సినిమాకి సక్సెస్ టాక్ వచ్చిన తరువాత మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుండటం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశం” అన్నాడు.

“గతంలో పిల్లలకు అమ్మమ్మలు .. నాన్నమ్మలు చందమామ కథలు చెప్పేవారు. పిల్లలు వాటిని ఎంతో శ్రద్ధగా వినేవారు. అలా ఒక చందమామ కథ మాదిరిగానే ఈ సినిమాను చూపించాము. రవితేజ .. రామ్ .. ఇలా చాలామంది ఈ సినిమా చూసి ట్వీట్స్ పెడుతూ ఉండటం, మా అందరికీ మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!