HomeTelugu Trendingతండ్రి కాబోతున్న నిఖిల్‌!

తండ్రి కాబోతున్న నిఖిల్‌!

Hero nikhil going to be a f
టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి బేబీ బంప్‌తో కనిపించిన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పల్లవి గర్భవతి అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఈ విష‌యంపై నిఖిల్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక‌ ప్రకటన చేయలేదు. ఇక 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కోవిడ్ టైంలో వీరి పెళ్లి కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు.

నిఖిల్ ప్ర‌స్తుతం ‘స్వయంభు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ భామ సంయుక్తామీనన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో నిఖిల్​ ఓ యోధుడి​ పాత్రలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!