బాలయ్యతో మిల్కీబ్యూటీ..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 101వ సినిమాపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా వినాయక్, శ్రీవాస్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ బాలయ్య మాత్రం సీనియర్ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథ తనకు బాగా సెట్ అవుతుందని బాలయ్య నమ్ముతున్నారు. సి.కల్యాణ్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే దర్శకనిర్మాతలు ఇద్దరూ ఈ సినిమాలో కథానాయికగా మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే తమన్నాతో ఈ విషయం గురించి చర్చించడం జరిగిపోయిందని చెబుతున్నారు. అయితే ఆమె కన్ఫర్మ్ చేయకపోయినా.. అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాత. తమన్నా ఇప్పటివరకు యంగ్ హీరోలతోనే తప్ప సీనియర్ హీరోలకు జంటగా నటించింది లేదు. తన తరువాత వచ్చిన లావణ్య త్రిపాఠి కూడా నాగార్జునతో కలిసి ఆడిపాడింది. మరి ఈసారి సీనియర్ హీరో సరసన వచ్చిన ఛాన్స్ ను ఈ భామ మిస్ చేసుకుంటుందో… లేక అంగీకరిస్తుందో.. చూడాలి!