HomeTelugu Newsసూర్య సినిమాలపై తమిళనాడులో నిషేధం..!

సూర్య సినిమాలపై తమిళనాడులో నిషేధం..!

9 23

తమిళ స్టార్ హీరో సూర్యపై థియేటర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య భార్య జ్యోతిక నటించిన ‘పోన్ మగల్ వందల్’ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య నిర్మించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే థియేటర్లలో ప్రస్తుతానికి విడుదల చేసే అవకాశం లేకపోవడంతో మే మొదటి వారంలో ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా విడుదల చేసేందుకు నిర్ణయించారు. దీంతో తమిళనాడు సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముందుగా సినిమాను థియేటర్లలో విడుదల చేశాకే మిగతా ఏ ప్లాట్‌ఫాంలలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలను కలిసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పామని తెలిపారు. వారి నిర్ణయం మార్చుకోబోమని చెప్పడంతో అందుకే భవిష్యత్తులో వారి బ్యానర్‌పై తీసే సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదలకు అనుమతించకూడదని నిర్ణయించినట్లు మీడియాకు వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!