స్విమ్మింగ్‌పూల్‌లో శ్రీయ అందాలు.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌లో 2001లో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీయ.. ఇప్పటికీ తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. కెరీర్ ఆరంభంలో చేసిన ప్రతీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుస ఆఫర్లను దక్కించుకుంది. దాదాపుగా టాలీవుడ్‌లోని అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో తమిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మూడు పదుల వయసులోనూ యంగ్‌ హీరోయిన్లతో పోటీ పడుతోంది శ్రీయ. చివరిసారిగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది. ప్రస్తుతం నరగాసురన్, సందక్కరి అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు డిసెంబర్‌లో రీలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, సినిమా గ్యాప్స్‌లో వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేసే శ్రీయ.. ప్రస్తుతం కేరళలో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది. తాజాగా స్విమ్మింగ్‌పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో మమ్మీ తీసిందని పేర్కొంది. శ్రీయ పోస్ట్ చేసిన వీడియో చూసి ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. నలభైకి దగ్గరవుతున్నా.. శ్రీయ అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు.