ఎన్టీఆర్ తో ఆ ఇద్దరు..!

ఎన్టీఆర్, దర్శకుడు బాబీతో ఓ సినిమా చేయడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు
హీరోయిన్స్ ఉంటారని చెబుతున్నారు. అయితే సినిమా అనుకున్నప్పటి నుండి హీరోయిన్స్ గా రాశిఖన్నా, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ ల పేర్లు వినిపించాయి.

తాజాగా ఈ ముగ్గురిలో ఇద్దరిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన నటించడానికి రాశిఖన్నా, నివేదా థామస్ లను సంప్రదించగా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే చిత్రబృందం అధికారికంగా ప్రకటించడానికి సిద్ధపడుతోందని అంటున్నారు. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు టాక్.