HomeTelugu Big Storiesడి & డి చిత్రంలో చిట్టి!

డి & డి చిత్రంలో చిట్టి!

Dhee Sequel movie

మంచు విష్ణు కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్‌ కాగా, శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని శ్రీనువైట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢీ సినిమాను మించి కామెడీ, యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుపుతూ డబుల్ డోస్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సీక్వెల్‌ను 24 ఫ్యాక్టరీ ఫిలింస్‌ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu