HomeTelugu Trendingహాయ్‌ నాన్న: గాజు బొమ్మ సాంగ్‌ అప్డేట్

హాయ్‌ నాన్న: గాజు బొమ్మ సాంగ్‌ అప్డేట్

hi nanna movie update
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమా తండ్రి, కుమార్తె సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక క్యూట్ వీడియో విడుదలైంది. నాని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ వీడియో షేర్‌ చేశాడు. ఈ వీడియోలో నాని, పాప మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకునేలా ఉంటుంది.

కిచెన్ లో నాని పాట పాడుతూ వంటపని చేస్తుంటాడు. ఇంతలో పాప… నాన్నా ఇది లవ్ స్టోరీయా అని ప్రశ్నిస్తుంది. అవును… లవ్ స్టోరీనే అని నాని రిప్లయ్ ఇస్తాడు. అయితే మన స్టోరీ కాదా అని పాప ప్రశ్నించగా, కాసేపు ఆలోచించిన నాని మన స్టోరీ కూడా అని చెబుతాడు. నువ్వు లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్ మరి మన సాంగ్ ఎప్పుడొస్తుంది అని పాప ప్రశ్నించగా నా గాజు బొమ్మ అంటూ కూతురిని ముద్దు చేస్తాడు.

నువ్వు రెడీయా అని పాపను అడగ్గా, రెడీ అని పాప జవాబిస్తుంది. అనంతరం, వీడియోలో గాజు బొమ్మ సాంగ్ ప్రోమో బిట్ దర్శనమిస్తుంది. ఈ పాట అక్టోబరు 6న రిలీజ్ కానున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న హాయ్ నాన్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!