HomeTelugu Trendingవాల్తేరు వీరయ్య: డబ్బింగ్‌ షురూ

వాల్తేరు వీరయ్య: డబ్బింగ్‌ షురూ

Waltair veerayya movie dubb
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్‌ చేశాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్‌ ఇప్పటి నుండి ప్రమోషన్‌లు మొదలు పెట్టింది. తాజాగా వాల్తేరు వీరయ్య సెట్‌లోనే ప్రెస్‌ మీట్‌ నిర్వహించి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిరంజీవితో పాటు రవితేజ కూడా డబ్బింగ్‌ స్టూడీయోకి వచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రవితేజ ఈ సినిమాలో పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఇటీవలే రిలీజైన ఆయన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. చిరంజీవి ఈ చిత్రంలో యూనియన్‌ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu