HomeTelugu Trendingబిగ్‌బాస్‌-5లో hmtv యాంకర్‌!

బిగ్‌బాస్‌-5లో hmtv యాంకర్‌!

Hmtv anchor in Bigg boss te

తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటికే నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదోవ సీజన్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయవ. నాల్గొవ సీజన్‌లో ఎక్కువ సోషల్ మీడియా స్టార్స్, ముఖ్యంగా యూట్యూబ్ స్టార్స్‌ను దర్శనమిచ్చారు. అయితే నాల్గొవ సీజన్‌లో పాల్గోన్న వారి మొఖాలు చాలా మందికి తెలియకపోవడంతో అభిమానులు మొదట్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఈసారి కాస్తా గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అప్పుడే సెలెక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొందరిని బుక్ చేసుకున్నారని.. వారికి భారీగా డబ్బులు ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది.ఈ సీజన్‌ను ఏప్రిల్‌లోనే స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ సీజన్‌కు పాపులర్ నటుల్నే తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఇప్పటికే.. ఇక ఈ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, దీపిక పిల్లి, యాంకర్ విష్ణు ప్రియ, రాకేష్ మాస్టర్‌, hmtv యాంకర్ రోజా పేర్లు ఫైనల్ అయ్యాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ సీజన్‌కు నాగర్జున హోస్ట్‌ కాదు అని.. ఆయన సినిమాలతో బీజీగా ఉండటంతో.. నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా రానున్నాడు తెలుస్తోంది. మరీ దీనిలో ఎంత నిజం ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!