HomeTelugu Trendingహనుమాన్ ట్రైలర్‌ ఎప్పుడంటే?

హనుమాన్ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Hanuman TrailerHanuman: తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్టర్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

హనుమాన్ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజైన టీజర్‌ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. యూనివర్సల్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్‌ వేల్యూస్‌తో వున్న విజువల్స్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

హనుమాన్ మూవీ ట్రైల‌ర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌కు సంబంధించి మేక‌ర్స్ తాజా అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ ట్రైల‌ర్‌కు సంబంధించి డిసెంబ‌ర్ 12న ప్రకటన ఉంటుందని చిత్ర‌బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న‌ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu