Homeతెలుగు Newsఆదాల ప్రభాకర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

ఆదాల ప్రభాకర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

adala prabhakar reddy ap
adala prabhakar reddy
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఆదాల ప్రభాకర్ రెడ్డి. ప్రజల వైపు వీచే రాజకీయ గాలిని పసిగట్టడంలో సిద్ధహస్తుడని ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆంధ్ర రాజకీయాల్లో మంచి పేరుంది. ముఖ్యంగా గెలిచే పార్టీ వైపు మళ్ళడంలో ఆదాల కు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది.  ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపురు గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.  ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదాల కావలి లోని జవహర్ భారతి కళాశాలలో పీయూసీ పూర్తి చేయడం జరిగింది.  ఆదాల రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేవారు. ఆదాల తొలుత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరి 1999 లో అల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో 1999–2000 వరకు హౌసింగ్ మినిస్టర్ గా కూడా  పనిచేశారు.

ఐతే,  2004 ఎన్నికలకు ముందు  రాజకీయ గాలిని ముందుగానే పసిగట్టాడు. వెంటనే.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి  ఆ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. 2009 లో సైతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించారు. ఇక  2014 లో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత  మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. ఆదాల మళ్లీ ఇక్కడే జాగ్రత్త పడ్డారు. 2019 ఎన్నికల్లో రాజకీయ గాలిని ముందుగానే పసిగట్టాడు. వెంటనే తేలుగుదేశం నుంచి వైసీపీ పార్టీ లో చేరి  నెల్లూరు లోక్ సభ నుంచి ఎంపీగా విజయం సాధించాడు.  ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. 
   
మరి  రాజకీయ నాయకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?,  ప్రజల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది ?,  ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఆదాల ప్రభాకర్ రెడ్డి మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు.  2024 లో నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధినేత జగన్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి  స్పష్టమైన హామీ వచ్చేసింది. ఐతే, రాజకీయ గాలి ని ముందుగానే  పసిగట్టడంలో సిద్ధహస్తుడైన ఆదాల,  వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే ఆసక్తి రాష్ట్ర నాయకుల్లో కూడా ఉంది. 
 
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన ఎలా సాగుతుంది ?,  ప్రజల్లో ప్రస్తుతం జగన్ రెడ్డి బలం ఎంత ?, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది ? వంటి అంశాల్లో ఇప్పటికే ఆదాల కు సృష్టమైన అవగాహన ఉంది. కాబట్టి.. వైసీపీ ఎమ్మెల్యేగా ఆదాల పోటీ చేస్తాడా ? అని ఆయన సన్నిహితుల్లో కూడా అనుమానం ఉంది. ఒకవేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వైసీపీ తరుపున పోటీ చేస్తే.. ఆయనకు గెలిచి నిలిచే పరిస్థితి లేదు. మొదటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ పార్టీల అండతోనే గెలుస్తూ వచ్చారు. ఆయనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను, ఫాలోవర్స్ క్రియేట్ చేసుకోవడంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి విఫలం అయ్యారు.        
 
కాబట్టి, వచ్చే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచే  ఛాన్స్  లేదు. ప్రజల్లో  ఒక ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి  పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా   ఆదాల ప్రభాకర్ రెడ్డిని తప్పించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి.. ఆదాల ప్రభాకర్ రెడ్డి  వైసీపీ పార్టీ నుంచి మళ్లీ గెలవడం దాదాపు అసాధ్యమే. అయితే, గెలిచే పార్టీ వైపుకు వెళ్లడం ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి, ఆయన చూపు మళ్లీ టీడీపీ వైపు కూడా పడొచ్చు. ఐతే, ఈ సారి చంద్రబాబు ఇలాంటి వారికీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో లేరు. కాబట్టి.. ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇక ఉండకపోవచ్చు.
Follow Us on FACEBOOK TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu