
Single Day Shoot Cost of Game Changer:
తెలుగు చిత్ర పరిశ్రమలో రౌండ్ టేబుల్ చర్చలు ఆసక్తికరంగా మారాయి. నెక్స్ట్-జెన్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, సహు గరపాటి, సుధాకర్ చెరుకూరి లతో ఈ సంవత్సరం జరిగిన చర్చలో గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన విషయాలు హైలైట్ అయ్యాయి.
గేమ్ చేంజర్ సినిమాలో ఒక్క రోజుకి వచ్చిన అత్యధిక ఖర్చు గురించి ప్రశ్నించగా. దిల్ రాజు బంధువుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హర్షిత్ రెడ్డి 2022 వరకు గేమ్ చేంజర్ టీంతో ఉన్నాను అని చెప్పి ఒక పాట షూట్ కోసం భారీ మొత్తం ఖర్చు అయ్యిందని వివరించారు. ఆ మొత్తం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే అన్నారు కానీ నంబర్ మాత్రం చెప్పలేదు.
BTS of 3rd single #NaaNaaHyraanaa from #GameChanger is On Loop already 😊💜@shankarshanmugh @advani_kiara @MusicThaman @singer_karthik @shreyaghoshal @SVC_official @ZeeStudios_ @saregamaglobal https://t.co/vX7VLMv2hb
— Ram Charan (@AlwaysRamCharan) November 27, 2024
ఒకే పాట కోసం అద్భుతమైన సెట్స్, డ్యాన్సర్లు, ప్రత్యేక లొకేషన్లు, ఆధునిక కెమెరా టెక్నాలజీ వాడటం వల్ల ఈ ఖర్చు భారీగా పెరిగిందని సమాచారం. ఈ ఒక్క రోజుకి ఖర్చు నిర్మాతల ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగింది అన్నారు.
సాహు గరపాటి ఫ్లిప్‌కార్ట్ కొత్త OTT ప్లాట్‌ఫారమ్ ప్రవేశపెట్టే అవకాశాల గురించి పంచుకున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల కోసం భారీ పెట్టుబడులు అవసరమవుతాయని, కానీ సినిమా బడ్జెట్ తగ్గించటం అంత ఈజీ కాదని బన్నీ వాస్ వివరించారు.
ALSO READ: Hyderabad metro విషయంలో కూడా Manmohan Singh హస్తం ఉందా? అసలు నిజం ఇదే!