నగ్నంగా నిల్చుంటే గానీ… శిక్షణ ఇవ్వనన్నాడు.. యాక్టింగ్ గురు వినయ్ వర్మపై కేసు

వినయ్ వర్మ… సినిమాలు చూసేవాళ్లకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో నటించాలని ఆరాటపడేవాళ్లకు మాత్రం కచ్ఛితంగా తెలిసే ఉంటుంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించిన వినయ్ వర్మ… హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ యాక్టింగ్ స్కూల్‌ కూడా పెట్టుకున్నాడు. సినిమాల్లోకి రావాలనుకునేవారికి ట్రైనింగ్ ఇచ్చే ఈ యాక్టింగ్ గురు… ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. తన దగ్గరకు నటన నేర్చుకోవడానికి వచ్చిన యువతులను నగ్నంగా నిల్చుంటే గానీ… శిక్షణ ఇవ్వనని వేధించడమే ఇందుకు కారణం. హిమాయత్‌నగర్‌లో ‘సూత్రధార’ పేరుతో ఓ వర్క్ షాప్ స్థాపించాడు వినయ్ వర్మ. ఈ స్కూల్‌కు వచ్చిన యువతులను గదిలో బంధించి, వారితో అసభ్యంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. తన కోచింగ్‌ సెంటర్‌కు యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చిన యువతుల దగ్గర్నుంచి రూ.25,000 ఫీజు వసూలు చేసే వినయ్ వర్మ… ట్రైనింగ్ పేరుతో వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. నగ్నంగా నిలబడితేనే కోచింగ్ ఇస్తానని చెప్పి, తనను ఓ గదిలో బంధించి వేధించాడంటూ ఓ యువతి… హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

ఈ నెల 15న ఉదయం 6:30 గం.లకు క్లాస్‌కు రమ్మంటే వెళ్లామని… యాక్టింగ్ గురుగా వచ్చిన వినయ్ వర్మ, తనతో పాటు మరో ఎనిమిది మంది అమ్మాయిలను ఓ గదిలో బంధించాడని పేర్కొంది. నటన నేర్చుకోవాలంటే తన ముందు బట్టలన్నీ విప్పి, నగ్నంగా నిల్చోవాలని చెప్పాడు వినయ్ వర్మ. నటన నేర్చుకుని, సినిమాల్లో వెలిగిపోదామని అనుకుని యాక్టింగ్ స్కూల్‌కి వచ్చిన అమ్మాయిలు… ఏ మాత్రం అభ్యంతరం లేకుండా బట్టలు విప్పి, నగ్నంగా నిల్చున్నారు. న్యూడ్‌గా క్లాసులు వినడానికి ఒప్పుకోని ఓ యువతి మాత్రం… వినయ్ వర్మకు ఎదురు తిరిగింది. నటనకు నగ్నంగా నిలబడడానికి సంబంధం ఏంటని నిలదీసింది. దాంతో ఆమెను క్లాస్ నుంచి బయటికి పంపేశాడు యాక్టింగ్ గురు వినయ్ వర్మ. తనకు జరిగిన షాకింగ్ అనుభవం నుంచి బయటికి వచ్చిన ఆమె… హైదరాబాద్ షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అయితే వారు సరిగా స్పందించకపోగా హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయల్సిందిగా సలహా ఇచ్చారు. నారాయణగూడ పోలీసులు కూడా సరిగ్గా స్పందించకపోవడంతో మీడియాను ఆశ్రయించి, తన గోడు వెల్లడించుకుంది సదరు యువతి. అయితే వినయ్ వర్మ మాత్రం తాను చెప్పినట్టు బట్టలు విప్పి, సిగ్గు బిడియం పక్కనబెట్టి యాక్టింగ్ నేర్చుకుంటే సినిమాల్లో అద్భుతంగా రాణిస్తారని చెబుతుండడం కొసమెరుపు. గతంలో చాలామంది ఇలాగే యాక్టింగ్ నేర్చుకున్నారని, వారు ఇప్పుడు ఉన్నతస్థానాల్లో ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. మహిళా సంఘాలు మాత్రం వినయ్ వర్మను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లో అవకాశాల కోసం బట్టలు విప్పిస్తారని తెలుసు కానీ యాక్టింగ్ నేర్చుకోవడానికి కూడా బట్టలు విప్పాల్సి వస్తుందని తెలిసి… సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు సినీ ఫ్యాన్స్. వినయ్ వర్మ థియేటర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా వాయిస్ యాక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, కాస్టింగ్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నాడు. నాని ‘జెంటిల్‌మెన్’ (నివేధా థామస్ మేనమామ), నయనతార ‘అనామిక’ వంటి టాలీవుడ్ సినిమాలతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించాడు వినయ్ వర్మ.

CLICK HERE!! For the aha Latest Updates