
Hyderabad Restaurants owned by Indian Cricketers:
హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తొస్తుంది! కానీ ఇప్పుడు స్పోర్ట్స్ సెలబ్రిటీల రెస్టారెంట్లతో కూడిన కొత్త ఫుడ్ ట్రెండ్ మొదలైంది. సినీ సెలబ్రిటీలు రెస్టారెంట్లు పెట్టడమంటే మామూలే, కానీ ఇప్పుడు క్రికెట్ స్టార్లు కూడా తమకు ప్రత్యేకమైన స్టయిల్లో రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు.
మొదటగా మన హైదరాబాద్ గల్లీలలో పెరిగిన క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్, ‘Joharfa’ అనే లగ్జరీ రెస్టారెంట్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.3లో ప్రారంభించబోతున్నారు. మగలాయ్, పర్షియన్, అరేబియన్, చైనీస్ వంటకాలు—all with a Miya Bhai twist! ఓపెనింగ్‌కి ముందే ఈ రెస్టారెంట్‌కి క్రికెట్ ఫ్యాన్స్‌లో మంచి హైప్ వచ్చింది.
ఇంకొక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా One8 Commune అనే తన ఫేమస్ రెస్టారెంట్ చైన్‌ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఓపెన్ చేశారు. RMZ The Loftలో ఉండే ఈ ప్లేస్ 2024 మేలో స్టార్ట్ అయింది. ఈ రెస్టారెంట్ ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి గుర్తుందా? ఒక్క స్వీట్ కార్న్‌కి రూ.525 ధర పెట్టి సెన్సేషన్ అయ్యింది!
ఇక మన హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు కూడా వెనుకబడలేదు. ఆయన Barracks & Anteroom అనే మిలిటరీ థీమ్‌లో ఉన్న రెస్టారెంట్‌ను సైనిక్‌పురిలో ప్రారంభించారు. మూడు ఫ్లోర్లుగా ఉండే ఈ ప్లేస్‌కి అటూ యువత, ఇటూ ఫ్యామిలీల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇలా క్రికెటర్లు కూడా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి, హైదరాబాద్‌కు కొత్త ఫ్లేవర్ తీసుకొస్తున్నారు. అభిమానులకైతే ఆటపాటలతో పాటు టేస్టీ ఫుడ్ కూడా అదనంగా లభిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరికొంత మంది స్పోర్ట్స్ సెలెబ్రిటీలు రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారా? చూడాలి మరి!
ALSO READ: 35 ఏళ్లుగా Salman Khan కి సోషల్ లైఫ్ లేదా?













