ఇల్లీ బ్యూటీ చనిపోవాలనుకుందట!

ఒకప్పటి దక్షినాది అగ్రతార ఇలియానా.. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆరంభంలో బాలీవుడ్ అవకాశాలు రాక ఇబ్బంది పడినప్పటికీ ప్రస్తుతం అరకొర అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఓ ఈవెంట్ పాల్గోన్న ఇలియానా తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వెల్లడించింది. పాపం ఇలియానాకు అంత కష్టం ఎలా వచ్చింది అనుకుంటున్నారా..? ఆమె శరీరాకృతిపై చాలా మంది కామెంట్స్ చేసేవారట.

ఆ విషయాలు ఆ నోట ఈనోటా చేరి ఇలియానా దగ్గరకు చేరాయి. దీంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. తనలో తాను బాధ పడుతూ
సూసైడ్ చేసుకోవాలని అనుకుందట. కానీ తనకు తాను ధైర్యం చెప్పుకొని ఆ ఆలోచనను అధిగమించినట్లు వెల్లడించింది. డిప్రెషన్ లోకి వెళ్ళే వారందరూ కూడా ముందుగా తమకు తాము ధైర్యం చెప్పుకోవాలని చెప్పుకొచ్చింది.

సినిమా వాళ్ళు అందంగా కనిపించడానికి రెండు, మూడు గంటల పాటు మేకప్ వేసుకుంటే సరిపోతుందని కానీ మనసు ప్రశాంతంగా
ఎలాంటి మేకప్ అవసరం లేదని చెప్పుకొచ్చింది.