కథ డిమాండ్ చేస్తే గ్లామర్‌ ఒలకబోయడానికి రెడీ!.. గుణ 369 హీరోయిన్

‘RX100′ ఫేమ్ కార్తికేయ హీరోగా, మళయాళీ భామ అన‌ఘ హీరోయిన్‌గా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన సినిమా..’గుణ 369’. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2 విడుదలైంది. ఈ సందర్బంగా హీరోయిన్ అనఘ మీడియాతో మాట్లాడుతూ.. నేను మలయాళీ అమ్మాయినంటూ.. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అందులో భాగంగా.. చదువు పూర్తయ్యాక సినిమావాళ్లతో పరిచయాలు ఏర్పరచుకున్నాను. అలా మలయాళం సినిమాలో నటించానని చెప్పింది. అయితే ఆ సినిమా హిట్ అవడంతో హీరోయిన్‌గా మలయాళంలోనే మరో రెండు సినిమాలు చేశానని.. అలాzనే తమిళంలో ‘హిప్ హాఫ్ తమిజా’ తో కూడా చేశానంది. అది కూడా సూపర్‌హిట్ అవ్వడంతో ఆమెను తెలుగులోకి పరిచయం చేయాలని గుణ 369 డైరెక్టర్ అర్జున్ అనుకున్నారు. ఈ మూవీలో తన పాత్ర అచ్చంగా మన పక్కింటి అమ్మాయిగా కనిపించాలని దర్శకుడు నన్ను ఎంపిక చేశారని అంటోంది అనఘ.

తాను అన్ని రకాల పాత్రలు చేస్తానని.. అవసరం అనుకుంటే గ్లామర్ కూడా ఒలకబోస్తానని అందంగా చెబుతోంది. అయితే కథ డిమాండ్ చేయాలట. అది అలా ఉంటే అనఘ తొలి తెలుగు చిత్రం గుణ 369లో అదరగొట్టింది. నటనతో పాటు.. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది.

CLICK HERE!! For the aha Latest Updates