అవకాశాలు లేవని బాధపడను!

దక్షిణాది సినిమాల్లో ఏడేళ్ళ పాటు నటించి ప్రేక్షకులను అలరించిన నాజూకు సుందరి ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ.. సినిమా మీద వ్యామోహంతో ఉన్న స్థాయికి చేరుకోవాలని అవకాశాలు రాక తమ జీవితాలను పోగొట్టుకోవడం నేను చూశానంటూ చెబుతోందీ భామ. నా వరకు నేను అవకాశాలు వస్తే నటిస్తాను.. లేదంటే అసలు బాధపడను. దక్షిణాది సినిమాల్లో చాలా కాలం పాటు నటించాను.

ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాను. తెలుగు సినిమాల్లో నటించడం చాలా సులభం.. వారు మూడు, నాలుగు నెలల్లో సినిమాను పూర్తి చేస్తారు. కానీ హిందీ సినిమాలు అలా కాదు. టెక్నికల్ గా మంచి ఔట్ పుట్ రావాలని ఎక్కువ సమయం తీసుకుంటారు. నాకు ప్రస్తుతం ముప్పై ఏళ్ళు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. దాని గురించి నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ తెలిపారు.