స‌ముద్ర‌తీరాన‌ మ‌హ‌నుభావుడు!

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా,  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కించిన‌ చిత్రం మ‌హ‌నుభావుడు చిత్రం ఇటీవ‌లే విడ‌దల‌య్యి క్లీన్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు కురిపిస్తుంది.  విజ‌యద‌శ‌మి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29న‌ విడుద‌ల‌య్యి న‌వ్వుల ద‌స‌రా గా మార్చిన తెలుగు ప్రేక్ష‌కులకి యూనిట్ అంతా థ్యాంక్స్ చెప్పాల‌ని విశాఖ‌ప‌ట్నం స‌ముద్ర‌తీరాన వేలాది మంది ప్రేక్ష‌కుల్ని క‌లిసి హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ముఖ్యంగా ఓసిడి పాత్ర‌తో హీరో శ‌ర్వానంద్ చేసిన కామెడి ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు అమితంగా ఆద‌రిస్తున్న మ‌హ‌నుభావుడు థ్యాంక్స్ మీట్ కి మంత్రివ‌ర్యులు శ్రీ గంటా శ్రీనివాస‌రావు గారు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌య్యారు. 
 
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. ముందుగా తెలుగు ప్రేక్షకుల‌కి ధ‌న్య‌వాదాలు. నాకు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రాన్ని మ‌రిచి పోయేలాగా మ‌హ‌నుభావుడు చిత్ర విజ‌యాన్ని అందించారు. మాకోసం టైం కేటాయించిన మంత్రివ‌ర్యులు గంటా శ్రీనివాస‌రావు గారికి ధ‌న్య‌వాదాలు. మా మ‌హ‌నుభావుడు చిత్రాన్ని ఫ్యామిలి అంద‌రూ వెల్లి చూడాల‌ని కొరుకుంటున్నాను.. అన్నారు
 
హీరోయిన్ మెహ‌రిన్ మాట్లాడుతూ.. మా చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. నా రెండో చిత్రం ఈ మ‌హ‌నుభావుడు. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌ల‌కి మా ధ‌న్య‌వాదాలు.. అన్నారు
 
మ్యూజిక్ ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని ఇంత మంచి స‌క్స‌స్ ని అందించిన వారంద‌రికి మా ధ‌న్య‌వాదాలు. మా స‌క్స‌స్ ఎన‌ర్జి మమ్మ‌ల్ని ఇలా వైజ‌గ్ వచ్చేలా చేసింది. అని అన్నారు.
 
హీరో  శ‌ర్వానంద్ మాట్లాడుతూ..  చాలా సంతోషంగా వుంది. స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర యాక్టింగ్ కోర్స్  నేర్చుకున్నాను. మ‌హ‌నుభావుడు ద్వారా వైజాగ్ ప్ర‌జ‌ల్ని క‌లిసినందుకు చాలా హ్య‌పి గా వుంది. మ‌హ‌నుభావుడు సినిమా చూడ‌కపోతే చూడండి .. చూస్తే మ‌ళ్ళి చూడండి. అన్నారు.