HomeTelugu Trendingవచ్చే ఎన్నికలు జగన్‌కు అనుకూలం : ఇండియా టుడే సర్వే

వచ్చే ఎన్నికలు జగన్‌కు అనుకూలం : ఇండియా టుడే సర్వే

వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై “ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా” సర్వే నిర్వహించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు ఐదు రోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో టీడీపీ పాలన పట్ల ఏపీ ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు “ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా” సర్వే వెల్లడించింది.

6 13

ఈ సర్వేపై ఇండియా టుడే ఛానెల్‌లో “పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌” పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ చర్చా కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్, రాహుల్‌ కన్వల్‌ నిర్వహించారు. ఇండియా టుడే సర్వేలో భాగంగా తదుపరి సీఎం ఎవరన్న సూటి ప్రశ్నకు 43% మంది జగన్‌కు అనుకూలంగా ఓటేశారని వారు వెల్లడించారు. 36% చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై బాగాలేదని, 18% ఓ మోస్తరుగా ఉందని స్పష్టం చేశారన్నారు. సీఎం అభ్యర్థి విషయంలో జగన్‌కు 43% మంది, చంద్రబాబుకు 38%, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌కు 5% మద్దతిచ్చినట్లు వెల్లడించారు.

త్వరలో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతో పాటు మిగతా రాష్ట్రాల్లో ప్రస్తుత సీఎంలకే అనుకూలంగా ఉందని, ఏపీలో మాత్రం ప్రతిపక్షనేతకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడే అవకాశముందని పొలిటికల్ సైంటిస్ట్‌ సందీప్ శాస్త్రి అన్నారు. ఒకవేళ టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైనా కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి పడే అవకాశం కూడా తక్కువేనని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రత్యేక హోదా కీలక అంశంగా మారనుందని సర్వేలో వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu