HomeTelugu Big Storiesభారత్‌లో కరోనా అప్‌డేట్‌

భారత్‌లో కరోనా అప్‌డేట్‌

11 21
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1543 కొత్త పాజిట్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29,974కి చేరింది. వీరిలో 7,027 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా రికవరీ రేటు 23.3 శాతంగా ఉందని తెలిపారు. గత 28 రోజుల్లో 17 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకుదేశవ్యాప్తంగా 937 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 8,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుజరాత్ 3548, ఢిల్లీ 3108, మధ్యప్రదేశ్ 2368, రాజస్థాన్‌ 2262, యూపీ 2043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజులో అత్యధికంగా 82 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259కి చేరింది. ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లాలో మరో 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 332 కరోనా కేసులు నమోదు కాగా, గుంటూరులో 254, కృష్ణా 223, నెల్లూరు 82, చిత్తూరు 74, కడప 65, ప్రకాశం 56, అనంతపురం 54, తూ.గో 39, విశాఖ 22, శ్రీకాకుళం 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 258 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 970 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,009కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 374 మంది డిశ్చార్జి కాగా, కరోనాబారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజు 42 మంది డిశ్చార్జి అయినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. వివిధ ఆస్పత్రుల్లో 610 మంది చికిత్సపొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu