అఖిల్ సినిమాలో టబు!

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్న నటి టబు. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ తెలుగులో సినిమాలకు మాత్రం అమ్మడు దూరంగా ఉందనే చెప్పాలి.
 
అప్పుడెప్పుడో బాలకృష్ణ సినిమాలో ఓ పాటలో కనిపించింది. ఆ తరువాత తెలుగు తెరపై ఈ భామ జాడ కనిపించలేదు.
అటువంటి టబు త్వరలోనే ఓ తెలుగు సినిమాలో కనిపించబోతోందని సమాచారం. అఖిల్ హీరోగా,విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
 
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టబుని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె కూడా పాత్ర పట్ల ఆసక్తి చూపుతోందట. అలానే టబుకి, అక్కినేని కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ విధంగా కూడా ఆమె ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా మేఘాఆకాష్ను ఎంపిక చేశారు.