కశ్మీర్‌లో కూలిన భారత ఛాపర్‌

జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఎంఐ 17 ఛాపర్‌ కూలిపోయింది. బుద్గాం జిల్లాలో గరెండ్‌ కలాన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఛాపర్‌కు చెందినదిగా భావిస్తున్న వీడియోను పలువురు సామాజికమాధ్యమాల్లో షేరుచేశారు. ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన విమానాలు సంచరించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. రాజౌరీ సెక్టార్‌కు సమీపంలో కూడా పాక్‌ యుద్ధవిమానాలు సంచరిస్తున్నాయి.