బాలకృష్ణ సొంత సంస్థను క్లోజ్ చేయబోతున్నాడా..?

నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారి తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించారు. బయోపిక్ లో ఫస్ట్ కథానాయకుడు, సెకండ్ పార్ట్ మహానాయకుడు సినిమాలు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకుంటే.. సినిమా పరంగా భారీ లాస్ వచ్చింది. దాదాపు రూ. 50 కోట్ల రూపాయలకు పైగా లాస్ వచ్చినట్టు తెలుస్తోంది.

లాభాలు రాకపోయినా కనీసం పెట్టిన డబ్బు వెనక్కొచ్చినా బాలయ్యబాబు సంతోషించేవారు. తన సినిమాలు ఇకపై సొంత నిర్మాణ సంస్థ నుంచే తెరకెక్కుతాయని గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాలకృష్ణ కెరీర్లో సినిమాలు చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. నిర్మాతగా వేసిన మొదటి అడుగు ఫెయిల్ కావడంతో… నిర్మాణ సంస్థను కంటిన్యూ చేయాలా లేదంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి బయటి ప్రొడక్షన్స్ లో సినిమాలు చేయాలా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. బోయపాటితో చేయబోతున్న నెక్స్ట్ సినిమా సొంత ప్రొడక్షన్స్ లోనే ఉంటుందని చెప్పినా.. ఇప్పుడు ఆ సినిమాను సొంతంగా నిర్మిస్తారా అన్నది డౌటే.