HomeTelugu Big Storiesరివ్యూ: ఇంద్రసేన

రివ్యూ: ఇంద్రసేన

జోనర్: యాక్షన్ ఎంటర్టైనర్
దర్శకత్వం: శ్రీనివాసన్
నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా ఆంటోనీ

కథ:
ఇంద్రసేన(విజయ్ ఆంటోనీ), రుద్రసేన(విజయ్ ఆంటోనీ) ఇద్దరు కవల పిల్లలు. ఇంద్రసేన ఎలిజెబెత్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ అమ్మాయి తన కళ్ల ముందే చనిపోవడంతో తాగుడుకి అలవాటు పడతాడు. తన తమ్ముడు రుద్రసేన మాత్రం పాఠశాలలో పీఈటీ మాస్టర్ గా పనిచేస్తుంటాడు. ఇది ఇలా ఉంటే.. రుద్రసేన తన స్నేహితుడి కోసం అప్పు చేస్తాడు. ఆ అప్పు కారణంగా ఇంద్రసేన కుటుంబం సమస్యల్లో ఇరుక్కుంటుంది. మర్డర్ కేసు విషయమై ఇంద్రసేన ఏడేళ్ళ పాటు జైలులోనే ఉంటాడు. మరి జైలు నుండి తిరిగి వచ్చిన ఇంద్రసేనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? వాటిని ఇంద్రసేన ఎలా ఎదుర్కొన్నాడు..? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్:
విజయ్ ఆంటోనీ
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:
ప్రోపర్ కథ లేకపోవడం
సెకండ్ హాఫ్
స్లో నేరేషన్

విశ్లేషణ:
కమర్షియల్ కథకు యాక్షన్, మసాలా, అన్నదమ్ముల సెంటిమెంట్ ను జోడించే కథ రాసుకున్నాడు దర్శకుడు. ఒక కొత్తరకమైన సినిమాగా ఈ కథ మొదలవుతుంది. కొంతవరకు సినిమాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. కానీ సెకండ్ హాఫ్ లో కథ పక్కదారి పడుతుంది. పతాక సన్నివేశాలను బాగా డిజైన్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇప్పటికే అన్నదమ్ముల సినిమాలను చాలానే చూశాం కానీ ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో కామెడీ లేకపోవడం, కథ మొత్తం సీరియస్ గా సాగడంతో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కదు.

రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu

జోనర్: యాక్షన్ ఎంటర్టైనర్ దర్శకత్వం: శ్రీనివాసన్ నిర్మాతలు: రాధికా శరత్ కుమార్, ఫాతిమా ఆంటోనీ కథ: ఇంద్రసేన(విజయ్ ఆంటోనీ), రుద్రసేన(విజయ్ ఆంటోనీ) ఇద్దరు కవల పిల్లలు. ఇంద్రసేన ఎలిజెబెత్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ అమ్మాయి తన కళ్ల ముందే చనిపోవడంతో తాగుడుకి అలవాటు పడతాడు. తన తమ్ముడు రుద్రసేన మాత్రం పాఠశాలలో పీఈటీ మాస్టర్ గా పనిచేస్తుంటాడు. ఇది ఇలా ఉంటే.. రుద్రసేన తన...రివ్యూ: ఇంద్రసేన
error: Content is protected !!