HomeTelugu TrendingFauji సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్!

Fauji సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్!

Interesting details about Fauji Shoot!
Interesting details about Fauji Shoot!

Fauji Shooting Updates:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు రెండు భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు – ఒకటి ‘ది రాజా సాబ్’, మరొకటి ‘ఫౌజీ’. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరో వైపు ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది.

ఈ మూవీకి దర్శకుడు హను రాఘవపూడి. తాజా సమాచారం ప్రకారం, ఆయన ప్రస్తుతం ఓ పెద్ద పాతకాలపు టింబర్ డిపో సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షూటింగ్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు.

ఫౌజీ కథ 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో సాగుతుంది. ఇది ఒక వార్ డ్రామా – కానీ ఇందులో రోమాన్స్, యాక్షన్ అంశాలూ బాగా ఉంటాయని టాక్. ప్రభాస్ ఇందులో ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. అతని పాత్రలో దేశభక్తి, ప్రేమ, పోరాటం అన్నీ ఉంటాయంటూ అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇందులో ఒక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే – ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ఇమాన్వి ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇస్తోంది. ఆమెకు ఇదే తొలి సినిమా. ప్రభాస్ సరసన ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నారు.

ఈ సినిమాకి మరో హైలైట్ – మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ బాలీవుడ్ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. మన సీనియర్ టాలీవుడ్ నటి జయప్రద కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదంతా కాకుండా, సినిమాకి సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ఈ భారీ వార్ డ్రామాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాలో కొత్త గెటప్, స్టైల్‌లో కనిపిస్తాడని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ చూస్తుంటే, త్వరలోనే మరో బిగ్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!