
Ramayana Teaser Details:
నితేష్ తివారి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘రామాయణ’ సినిమా ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ WAVES 2025 లో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పుడు ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఇప్పటికే టీజర్ కట్ పూర్తి చేసి సెన్సార్‌కు పంపారు. మే 5న CBFC టీజర్‌కు సెన్సార్ ఇచ్చింది. టీజర్ నిడివి 2 నిమిషాలు 36 సెకన్లుగా ఉంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అభిమానులు టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు!
ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి తొలిసారి బాలీవుడ్‌లో ప్రధాన పాత్రలో నటించడమే కాదు, ఆమె లుక్‌పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. మరోవైపు, యష్ రావణుడిగా పవర్ఫుల్ పాత్రలో దర్శించనుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా మొత్తం రెండవ భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికు, రెండవ భాగం 2027లో విడుదల కానుంది. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం టెక్నికల్ టీమ్ అంతా హాలీవుడ్ లెవెల్‌లో పనిచేస్తోంది.
ఇలాంటి పౌరాణిక చిత్రానికి ఈ తరం టెక్నాలజీ, స్టార్ పవర్ కలిస్తే… విజయం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు!
ALSO READ: Sania Mirza Car Collection లో కొత్తగా చేరిన మరొక కాస్ట్లీ కార్ ధర ఎంతో తెలుసా?













